Saturday, 19 October 2024

తోటకూర పులుసుకూర

ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనలని ఆకుకూరలు బాగా తినమని చెప్తాడు.అందులో మనం ఆకుకూరలు బాగానే వాడుతాము పాత రోజులు నుంచి.మా అమ్మమ్మ వాళ్ళు రాచిప్పలలో చేసుకునేవాళ్ళు అంట ఈ పులుసుకూరలు.చాలా రుచిగా ఉంటుంది అంట రాచిప్పలలో చేసుకునే పులుసుకూర.అప్పట్లో పెసర పప్పు బాగా వాడే వాళ్ళు పులుసుకూరలకి.కానీ ఇప్పుడు ఎక్కువగా కంది పప్పు వాడుతున్నారు.నేను కందిపప్పు కడిగి,ఒకటికి రెండు నీళ్లు పోసి ఉడకబెడతాను.కుక్కర్ లో అయితే,అట్లనే ఇంకో గిన్నె లో ఆకుకూర,ఎర్రగడ్డ,పచ్చిమిరపకాయలు,ఒక టమాటో తరిగి పెడతాను.కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తరువాత స్టవ్ ఆపేస్తాను.చల్లారిన తరువాత రెండిటినీ వేరే వెడల్పు గిన్నె లోకి తీసుకుని,స్టవ్ పైన పెడతాను.ఇప్పుడు దాంట్లోకి మోయనగా ఉప్పు,పసుపుపొడి,పులుసుపొడి,కారం పొడి వేసి బాగా ఇంకో 5-10 నిముషాలు తెర్లనిస్తాను.ఈ లోపల పక్కన చిన్న బాణట్లో నూనె ఒక స్పూన్ వేసి,ఆవాలు,ఇంగువపొడి,జీలకర్ర,మినపపప్పు,సెనగబేడలు వేసి,వేగనిస్తాను.ఈ తిరగమాతలో కొంచెం తరిగిన కరివేపాకు,కొత్తిమీర వేసి పప్పులోకి వేసి,కలుపుతాను. మా అమ్మ.అత్తా వాళ్ళు టమాటో కి బదులు పులుపుకి చింతపండు వాడేవాళ్ళు.ఆకుకూరలలోకి టొమాటో వాడేదానికి భయపడేవాళ్ళు చింతపండు వాడొచ్చు.

No comments:

Post a Comment